: కేంద్రం స్పందన ఎఫెక్ట్!... హైకోర్టులో ‘హోదా’పై విచారణ వచ్చే వారానికి వాయిదా!


ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుంటుకున్నాయి. నిన్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక భేటీ, ఆ తర్వాత మరోమారు మంత్రుల భేటీ, తదనంతరం చంద్రబాబుతో చర్చల కోసం వెంకయ్య బెజవాడ పయనం... వెరసి నిన్న ఏపీకి ప్రత్యేక హోదాపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఏపీకి ప్రత్యేక హోదాపై ఇదివరకే దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడిపోయింది. నేటి ఉదయం విచారణకు వచ్చిన ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం కసరత్తు నేపథ్యంలో తమ వాదనలు వినిపించేందుకు వారం గడువు కావాలని సాక్షాత్తు పిటిషనర్ తరఫు న్యాయవాదులే కోరారు. దీంతో వచ్చే బుధవారానికి ఈ విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News