: ఖాకీల మెడకు చుట్టుకున్న నయీమ్ దందా!... సిట్ నుంచి సీఐ బదిలీ!
గ్యాంగ్ స్టర్ నయీమ్ కొనసాగించిన దందా ఇప్పుడు తెలంగాణ పోలీసు శాఖలోని కింది స్థాయి అధికారుల మెడకు చుట్టుకుంది. నయీమ్ తో ప్రత్యక్ష సంబంధాలు నెరపారని ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వెల్లువెత్తగా, ఆ దిశగా ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదు. తాజాగా నయీమ్ తో సంబంధాలు నెరపారన్న ఆరోపణలతో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు సీఐలపై బదిలీ వేటు పడింది. ఇప్పటికే నల్లగొండ టూటౌన్ సీఐ రవీందర్ పై బదిలీ వేటు పడింది. తాజాగా కోదాడ సీఐ మధుసూదన్ రెడ్డిపైనా బదిలీ వేటు పడింది. ఇక నయీమ్ దందా గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో స్థానం లభించిన సీఐ నర్సింహారెడ్డికి కూడా నయీమ్ తో సంబంధాలున్నాయని తేలింది. దీంతో సిట్ నుంచి నర్సింహారెడ్డిని సిట్ నుంచి బయటకు పంపేశారు.