: బస్సులోనే గొడుగులేసుకుని కూర్చున్న ప్రయాణికులు!
హైదరాబాద్ లో ఈరోజు కురిసిన భారీ వర్షానికి నగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా రోడ్లు జలమయం అవడంతో సిటీ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, హైదరాబాద్ లోని ప్రభుత్వ సిటీ బస్సు లింగంపల్లి-దిల్ షుక్ నగర్ (నంబరు 218,ఏపీ 11- జెడ్, 7287) లోని ప్రయాణికులు వర్షం కారణంగా ఇబ్బంది పడ్డారు. బస్సుపైన చిల్లుల కారణంగా, బస్సులోపలకి వాన నీరు వస్తుండడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బస్సులోనే వారు గొడుగులు వేసుకుని కూర్చోవాల్సి వచ్చింది.