: ప్రత్యేక హోదాకు, గవర్నర్‌కు సంబంధమేంటీ? సుజ‌నాచౌద‌రి గ‌వ‌ర్న‌ర్‌ను ఎందుకు కలిశారు?: వైసీపీ నేత భూమ‌న


గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను కేంద్రమంత్రి సుజ‌నాచౌద‌రి క‌ల‌వ‌డం వెనుక కార‌ణ‌మేంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ భూమన కరుణాకరరెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక‌ హోదాకు, గ‌వ‌ర్న‌ర్ కు సంబంధం ఏంటని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ తీరుపైనా అప‌న‌మ్మ‌కం క‌లిగేలా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విష‌యంపై రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు ప్ర‌క‌ట‌ననివ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబును కాపాడే బాధ్య‌త‌ను సుజ‌నా త‌న భుజాల‌పై వేసుకున్నారని ఆయ‌న ఆరోపించారు. చిన్న‌పాటి కేసుల్లో ప్ర‌జ‌ల‌ను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని, కానీ రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న చంద్ర‌బాబును ఎందుకు వ‌దిలేశారని ఆయ‌న ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News