: బలోచి భాషలో ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు
బలోచి భాషలో ఆల్ ఇండియా రేడియా (ఎయిర్) ప్రసారాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా లభించాయి. కాగా, పాకిస్థాన్ లో అంతర్భాగమైన బలూచిస్థాన్ లో మానవహక్కుల ఉల్లంఘన, పాక్ సైనికుల ఆగడాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రస్తావించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఉంచాలన్న మోదీ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే బలోచి భాషలో 'ఎయిర్' ప్రసారాలు ప్రారంభించాలనుకోవడం గమనార్హం.