: ‘నయీం’ పోస్టర్ చూడండి, ఎంత సృజనాత్మకంగా ఉందో!: రాంగోపాల్ వర్మ
గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తీస్తానని చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఆ సినిమా పోస్టర్ ను ట్వీట్ చేశారు. అయితే, ఈ పోస్టర్ కు, ఆయన సినిమాకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే, ఈ పోస్టర్ ఆయన తీయబోయే సినిమాకు సంబంధించి కాదు. ఎంతో సృజనాత్మకంగా ఈ పోస్టర్ ను ఒకరు రూపొందించారని వర్మ పేర్కొన్నారు. నయీం నేర జీవితంలో ఏ విధంగా ఎదిగాడో, అంటే.. నక్సలైట్, క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్ వంటి పదాలతో నయిీం పోస్టర్ ను రూపొందించారని ఆ ట్వీట్ లో ఆయన వివరించారు.