: తెలుగుతేజం పి.వి.సింధుకు రెండు కోట్ల రూపాయల చెక్‌ను అందజేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఇటీవలే ముగిసిన ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి. సింధు అంచనాలకు మించి రాణించి రజత పతకంతో భారత్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు రెండు కోట్ల రూపాయల నజరానాను ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమెకు ఆ బహుమతిని అందించింది. సింధుతో పాటు రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షిమాలిక్‌కు ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెక్‌లను ఇచ్చారు. సింధుకు రెండు కోట్ల రూపాయల చెక్, సాక్షిమాలిక్‌కు కోటి రూపాయల చెక్కును ఆయన అందించారు.