: తల్లి కళ్లముందే బాలిక కిడ్నాప్... ఆపై అత్యాచారం.. హత్య!


ఎన్ని చట్టాలు చేసినా దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతి రోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వుంటున్నాయి. తాజాగా దక్షిణ కోల్ కతాలోని రోడ్డు పక్కగా గుడిసె వేసుకుని జీవిస్తున్న కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలికను ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు కిడ్నాప్ చేశారు. బాలికకు కాస్త దూరంగా ఉన్న ఆమె తల్లి కిడ్నాప్ జరగడాన్ని చూసి, స్థానికులను అప్రమత్తం చేస్తూ కుమార్తెను రక్షించేందుకు ఉపక్రమించేలోగా వారు ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం పార్క్ సర్కస్ ఫ్లై ఓవర్ పక్కనే కారునాపి, కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక గొంతునులిమి చంపి పక్కనే ఉన్న కాలువలోకి విసిరేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, చివరికి ఆ దుండగుల్ని వెంటాడి పట్టుకుని అరెస్ట్ చేశారు. వారిలో ఒక వ్యక్తి 'ఓలా' క్యాబ్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ముందు దుండగులిద్దరూ పీకలదాక మద్యం తాగినట్టు వారు వెల్లడించారు. ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News