: ప్రకాశం బ్యారేజీ లో పూర్తిస్థాయి నీటిమట్టం
విజయవాడ ప్రకాశం బ్యారేజీలోకి పూర్తి స్థాయి నీటిమట్టం చేరడంతో జలకళ కనపడుతోంది. 12 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 7,500 క్యూసెక్కుల నీరు ప్రకాశంకు వచ్చి చేరుతోందని, బ్యారేజీ 8 గేట్లు తెరచి 5,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, మరికొంత నీటిని సాగు, తాగు నీరు అవసరాల నిమిత్తం డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కాలువలకు 10,338 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు.