: హైదరాబాద్ సిటీలో ఈరోజు సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభించే అవకాశాలు
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో మరింత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ సూచించారు. ఈరోజు సాయంత్రం ట్రాఫిక్ భారీగా స్తంభించే అవకాశాలున్నాయని, సిటీలో ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.