: ‘హోదా’ ఇవ్వకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరచడమే: రఘువీరారెడ్డి
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తే, బీజేపీ కేవలం రూ.6 వేల కోట్లే విడుదల చేసిందని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ ఎన్నో కబుర్లు చెబుతున్నాయని, ప్రజలను మోసం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు.