: ప్రేమతో ఇచ్చిన రూ. 5.5 కోట్ల విలువైన కారును వేసుకెళ్లి యాక్సిడెంట్ చేసొచ్చిన ఎమ్మెల్యే భార్య


మహారాష్ట్రలో అధికార బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న నరేంద్ర మెహతా, తన భార్య సుమన్ కు ఎంతో ప్రేమతో రూ. 5.5 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి మురిసిపోయిన వేళ, ఆ కారును బయటకు తీసుకెళ్లిన సుమన్ యాక్సిడెంట్ చేసొచ్చింది. ఈ ఘటన థానేలో జరుగగా, లాంబోర్గిని సంస్థకు చెందిన ఈ కాషాయ రంగు కారు చేసిన యాక్సిడెంట్ వీడియోకు చిక్కి వైరల్ అయింది. ఆగస్టు 27న తన భార్య పుట్టిన రోజు కానుకగా, కారును బహుమతిగా ఇస్తూ, ఆ చిత్రాలను నరేంద్ర మెహతా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు కూడా పెట్టారు. ఆపై యాక్సిడెంట్ తరువాత జరిగిన ప్రమాదం చాలా చిన్నదని, ఆ సమయంలో తన భార్యే కారును నడుపుతోందని, ఎవరికీ గాయాలు కాలేదని ఆయన వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఎలాంటి కేసునూ పెట్టలేదని సమాచారం.

  • Loading...

More Telugu News