: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని చెప్పారు. అది 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతూ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర సమీపంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతోనే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.