: కర్ణాటక సీఎం చేతిలో మంత్రించిన నిమ్మకాయ.. పుత్రశోకం నుంచి బయటపడడానికేనా?
మూఢనమ్మకాలకు ఆమడదూరంలో ఉండే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతిలో నిమ్మకాయతో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మంగళవారం మైసూరులోని రామకృష్ణ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన సీఎం మంత్రించిన నిమ్మకాయను చేతితో పట్టుకుని వచ్చారు. దీంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ఎవరూ సీఎంను ప్రశ్నలు అడగలేదు. ఇటీవల ముఖ్యమంత్రి తనయుడు రాకేశ్ మృతితో కుంగిపోయిన సిద్ధరామయ్య పుత్రశోకం నుంచి బయటపడేందుకే నిమ్మకాయ చేబూనినట్టు చెబుతున్నారు. అయితే స్వతహాగా మూఢనమ్మకాలను దరిచేరనివ్వని ఆయన ఇలా చేతిలో నిమ్మకాయతో మీడియా సమావేశానికి హాజరుకావడం మాత్రం పలువురిని ఆశ్చర్యపరిచింది.