: సహాయక చర్యలు ఎందుకు చేపట్టలేదంటూ అధికారులపై ‘భూమా’ మండిపాటు


కర్నూలు జిల్లాలో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వరదనీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నంద్యాలలో వరద బాధితులను టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పరామర్శించారు. ఇక్కడ ఊరంతా మునిగిపోతుంటే సహాయక చర్యలు చేపట్టకుండా, మీటింగుల్లో కూర్చుంటారా? అంటూ మున్సిపల్ అధికారులపై ఆయన మండిపడ్డారు. అధికారుల చేతగానితనం వల్ల ప్రజల వద్ద తాము తలదించుకోవాల్సి వస్తోందన్నారు. సక్రమంగా పనిచేయరు, రోడ్లు నిర్మించరూ, వచ్చిన నిధులన్నీ ఏం చేస్తున్నారంటూ అధికారులపై భూమా ఆగ్రహించారు.

  • Loading...

More Telugu News