: కేంద్ర ఉద్యోగులకు వారం ముందే పండగ... రెండేళ్ల పెండింగ్ బోనస్ ఇస్తున్నామన్న జైట్లీ
వినాయక చవితి పర్వదినానికి వారం రోజుల ముందే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారింట పండగ వాతావరణం వచ్చేసింది. 2014-15 నుంచి పెండింగ్ లో ఉన్న బోనస్ లను చెల్లించనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఈ రెండేళ్ల బోనస్ నూ సవరించిన నిబంధనల ప్రకారం, 7వ వేతన సంఘ పరిధిలోకి తెస్తున్నట్టు ఆయన తెలిపారు. రెండేళ్ల వార్షిక బోనస్ ను చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో, దాదాపు 33 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. కాగా, 2013-14లో కేంద్ర ఉద్యోగులు బోనస్ ను అందుకున్న తరువాత, ఈ రెండేళ్లూ వారికి ఎటువంటి బోనస్ రాలేదన్న సంగతి తెలిసిందే.