: పీక‌ల్లోతు అప్పుల్లో పాకిస్థాన్.. 74 ట్రిలియన్‌ రూపాయల విదేశీ అప్పులు


ఇష్టం వ‌చ్చిన‌ట్లు విదేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటున్న పాకిస్థాన్ చిక్కుల్లో ఇరుక్కుపోతోంది. పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నెలలో పాకిస్థాన్‌కు ఉన్న అప్పులు 74 ట్రిలియన్‌ రూపాయలని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్ తాజాగా పేర్కొంది. పాకిస్థాన్‌పై అప్పుల భారం ఎన్నడూ లేనంతగా ప‌డింద‌ని చెబుతోంది. గత నాలుగు సంవత్సరాల్లోనే పాకిస్థాన్ విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పు దాదాపు 11.15 ట్రిలియన్‌ రూపాయలు అధిక‌మైంది. 2013 జులైలో 61.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అప్పులు ఈ ఆర్థిక సంవత్స‌రం మొద‌టి మాసం నాటికి విప‌రీతంగా పెరిగిపోయాయి.

  • Loading...

More Telugu News