: హైదరాబాదులో కేసీఆర్ అన్న కుమార్తె అరెస్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యను హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బోడిగ శోభను అరెస్టు చేయాలంటూ ఆమె గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. చిన్నాన్నతో విభేదించి కాంగ్రెస్ లో చేరిన రమ్య ఆందోళన చేయడంతో అక్కడికి కాంగ్రెస్ నాయకుల తాకిడి పెరుగుతోంది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.