: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లోనూ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నల్గొండ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యపేట మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. నేలమర్రిలో పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు, మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. నకిరేకల్, భువనగిరి, ఆలేరులో ఓ మోస్తరు వర్షం పడింది.