: కిమ్ జాంగ్ పైశాచికం... యుద్ధ విమానాలను పేల్చే క్షిపణులతో మంత్రి సహా ఇద్దరిని జనం మధ్య చంపించిన వైనం


తన మాటను జవదాటారన్న ఆగ్రహంతో ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్-ఉన్, ఓ మంత్రి సహా ఇద్దరిని అత్యంత కిరాతకంగా ప్రజల సమక్షంలో చంపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో వీరిని అందరూ చూస్తుండగా, యుద్ధ విమానాలను పేల్చేసే క్షిపణులను వాడి ఆయన చంపించాడని తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి హ్వాంగ్ మిన్, విద్యాశాఖలోని ఉన్నతాధికారి రీ యాంగ్ జిన్ తన ఆదేశాలు నిర్లక్ష్యం చేశారన్న కోపంతో చంపించినట్టు అనధికార వర్గాల సమాచారం. మాట వినకపోతే సొంతవారని కూడా చూడకుండా చంపించడం కిమ్ జాంగ్ కు అలవాటే. 2012లో ఆయన తన సొంత మామను, గత సంవత్సరంలో మాజీ రక్షణ మంత్రిని ఆయన బహిరంగంగా హత్య చేయించారు.

  • Loading...

More Telugu News