: శ్రీలంక అధ్యక్షుడి వెబ్ సైట్ హ్యాక్ చేసి...పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేసిన విద్యార్థి


జీసీఈ అడ్వాన్స్డ్ పరీక్షలు వాయిదా వేయించాలని భావించిన శ్రీలంక విద్యార్ధి ఏకంగా దేశాధ్యక్షుడి వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధికారిక వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన సదరు విద్యార్థి కొన్ని డిమాండ్ల చిట్టాను అక్కడి వాల్ పై పోస్టు చేశాడు. జీసీఈ పరీక్షను రద్దు చేయాలని, లేనిపక్షంలో పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాకింగ్ సహాయంతో కొలంబోకి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న కడుగన్నావాలో అతని నివాసంలో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి 3 ఏళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News