: వైద్యం అందక.. తండ్రి భుజాలపైనే ప్రాణాలొదిలిన కుమారుడు
ఉత్తరప్రదేశ్ లో సకాలంలో వైద్యమందక తండ్రి భుజాలపైనే కుమారుడు కన్ను మూసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కాన్పూర్ లోని లాలా లజపతిరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి సునీల్ కుమార్ అనే వ్యక్,తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడు అంశ్ (12) ను తీసుకొచ్చాడు. స్థానిక ఆసుపత్రిలో చూపించగా పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారని, ఎమర్జెన్సీలో చేర్చి చికిత్స అందించాలని ఆయన లాలా లజపతిరాయ్ ఆసుపత్రి వైద్యులను కోరాడు. వైద్యులు కనీసం తనను పట్టించుకోలేదని, అక్కడి నుంచి పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పడానికి వారికి అరగంట పట్టిందని ఆయన ఆరోపించాడు. అక్కడి నుంచి పిల్లల ఆసుపత్రి దూరం కావడంతో పిల్లాడిని పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్తామని స్ట్రెచర్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని, దీంతో తన కుమారుడిని భుజంపై అక్కడికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యంలో మృతిచెందాడని, దీంతో ఆ మృతదేహాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూనే ఇంటికి వెళ్లానని ఆయన తెలిపాడు.