: టాప్ అథ్లెట్లకే ప్రభుత్వాల సహకారం... మూలాల్ని పట్టించుకోకుంటే పతకాలు అసంభవం: పుల్లెల గోపీచంద్


ఇండియాకు బ్యాడ్మింటన్ విభాగంలో ఒలింపిక్స్ పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, పీవీ సింధుల కోచ్ పుల్లెల గోపీచంద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కష్టపడి, సత్తా చాటి ఉన్నత స్థానాలకు చేరిన అథ్లెట్లకు మాత్రమే ప్రభుత్వాల నుంచి సహకారం అందుతోందని, క్షేత్రస్థాయిలో మూలాలను బలపరచాలన్న లక్ష్యం సుదూరంగా ఉందని అన్నాడు. క్షేత్ర స్థాయిలో ఏ విధమైన క్రీడాభివృద్ధి జరగడం లేదని, ఈ విషయంలో మార్పు రానంతవరకూ ఇండియా పతకాలకు సుదూరంగానే ఉంటుందని అన్నాడు. ఒలింపిక్స్ వంటి క్రీడల్లో జనాభా వాటాకు తగినన్ని పతకాలు అసంభవమని అభిప్రాయపడ్డాడు. పాఠశాల స్థాయిలోనే ఆటలపై విద్యార్థులకు మక్కువ పెరగాల్సి వుందని, వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఏర్పాట్లూ జరగాలని ఓ చర్చా వేదికలో పాల్గొన్న గోపీచంద్ వ్యాఖ్యానించాడు. విద్యార్థులు క్రీడలను లక్ష్యంగా చేసుకుని సాధన చేసే పరిస్థితి ఇండియాలో కనిపించడం లేదని అన్నాడు.

  • Loading...

More Telugu News