: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పేలుళ్లు...ఆందోళనలో స్థానికులు
హైదరాబాదులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ కుత్బుల్లాపూర్ లో గత అర్ధరాత్రి పేలుళ్లు సంభవించాయి. కుత్బుల్లాపూర్ లోని ఓ నాలాలో అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో ఉలిక్కిపడ్డ కాలనీ వాసులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అనంతరం వివిన్ కెమికల్ ఫ్యాక్టరీ నాలాలోకి విడుదల చేసిన వ్యర్థాల కారణంగా ఈ పేలుళ్లు సంభవించాయని గుర్తించారు. దీంతో స్థానికులంతా కలిసి ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని, వ్యర్థాలను నాలాలోకి విడుదల చేసి స్థానికుల ప్రాణాలతో ఫ్యాక్టరీ యాజమాన్యం చెలగాటమాడుతోందని వారు ఆరోపిస్తూ పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు.