: గిలానీ కుమారుడికి ఎన్ఐఏ సమన్లు...ఇలాంటి చర్యలతో తమను భయపెట్టలేరంటున్న గిలానీ అనుచరులు
ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం చోటుచేసుకున్న ఆందోళనల్లో యువకులను రెచ్చగొట్టేందుకు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వేందుకు వేతనాలు ఇస్తున్నట్టు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు, కశ్మీర్ లో జూలై 8 తరువాత ఎవరెవరి అకౌంట్లలో భారీగా డబ్బులు జమ అయ్యాయో గుర్తించాయి. దీంతో కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ నాయకుడు గిలానీ పెద్ద కుమారుడు డాక్టర్ నయీం గిలానీని విచారణకు హాజరుకావాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సమన్లు జారీ చేసింది. ఈ అల్లర్లలో 71 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి చర్యలు తమను భయపెట్టవని గిలానీ అనుచరులు పేర్కొంటున్నారు.