: అమేథీలో రాహుల్ పర్యటనకు సన్నాహాలు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీలో పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 31 నుంచి మూడు రోజుల పాటు రాహుల్ తన నియోజక వర్గంలో పర్యటించనున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ చీఫ్ యోగేంద్ర మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ బుధవారం రాత్రికి అమేథీ చేరుకోనున్నారని, ఆ మర్నాడు మున్షిగంజ్ గెస్ట్ హౌస్ వద్దకు వచ్చే స్థానికులను కలుసుకుంటారని చెప్పారు. అనంతరం జగదీష్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జఫర్ గంజ్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు. తన పర్యటన చివరిరోజున జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ పాల్గొననున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News