: వృద్ధిరేటు ఊపందుకుంది.. కానీ ఆశించిన స్థాయిలో లేదు: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్


దేశంలో వృద్ధిరేటు గురించి ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్ ఈరోజు మీడియాకు ప‌లు వివ‌రాలు తెలిపారు. దేశంలో వృద్ధిరేటు ఊపందుకుంద‌ని చెప్పిన ఆయ‌న‌... ఆశించిన స్థాయిలో మాత్రం లేదని అన్నారు. ఈ ఏడాది వృద్ధిరేటు 7.6 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ ల‌క్ష్యం క‌న్నా ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగానే ఉందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బ‌ణం త‌గ్గితే వ‌డ్డీరేట్లు త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని, నాలుగో త్రైమాసికం నాటికి ద్ర‌వ్యోల్బ‌ణం 5 శాతం ఉంటుంద‌ని అంచ‌నా ఉంద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News