: ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్
జియో 4 జీ సిమ్ తో రిలయన్స్ మూడు నెలల పాటు 4 జీ ఇంటర్నెట్, వాయిస్, వీడియో కాలింగ్ సర్వీసులను ఉచితంగా అందిస్తూ వినియోగదారులను తమ వైపుకి తిప్పుకుంటున్న సంగతి విదితమే. దీంతో టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే పలు టెలికాం కంపెనీలు ధరలను తగ్గిస్తున్నాయి. భారతి ఎయిర్ టెల్ తమ సిమ్ కార్డ్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. 4జీ సర్వీసులో రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏకంగా 80 శాతం ధరను తగ్గిస్తున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. రూ.51 కే వన్ జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఈనెల 31 లోగా దేశవ్యాప్తంగా ఈ ఆఫర్‌ను అమలుచేయనుంది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే కస్టమర్లు ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రీచార్జ్‌తో 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా లభిస్తుంది. అనంతరం ఒక సంవత్సరం పాటు రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా పొందవచ్చు. వినియోగదారులు ఎన్నిసార్లయినా సంవత్సరంలో రూ.51కే రిచార్జ్ చేసుకొని ఒక జీబీ 4జీ డేటా పొందవచ్చు. ఇటువంటి ఆఫరే రూ.748 రీచార్జ్ చేసుకుంటే కూడా ఆరు నెలల వరకు పొందవచ్చు. ఈ రీచార్జ్‌తో రూ.99కు ఒక జీబీ 4జీ డేటా పొందవచ్చు.