: పెరిగిన కార్ల అమ్మకాల ప్రభావం... 52 వారాల గరిష్ఠానికి టాటా మోటార్స్ ఈక్విటీ జంప్


గత కొంతకాలంగా వాహనాలు, ముఖ్యంగా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగగా, ఆ ప్రభావం టాటా మోటార్స్ ఈక్విటీ విలువను అమాంతం పెంచింది. టాటా మోటార్స్ అధీనంలోని హైఎండ్ లగ్జరీ కార్లు జేఎల్ఆర్ (జాగ్వార్ లాండ్ రోవర్) యూనిట్ల అమ్మకాలు పెరిగాయన్న వార్తలకు తోడు, సమీప భవిష్యత్తులో కార్ల అమ్మకాలు పెరగనున్నాయని రెలిగేర్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ వెలువరించిన అంచనాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచగా, టాటా మోటార్స్ ఈక్విటీ విలువ 52 వారాల గరిష్ఠానికి చేరింది. ఈ ఉదయం బీఎస్ఈలో సంస్థ వాటా విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 4 శాతం పెరిగి రూ. 523కు చేరింది. గత సంవత్సరం ఆగస్టు తరువాత టాటా మోటార్స్ ఈక్విటీ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News