: ఎమ్మెల్యే కాకముందు దోపిడీలు చేసిన చరిత్ర పిన్నెల్లిది: యరపతినేని
గుంటూరు జిల్లా మాచర్ల, గురజాల ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయాలు రక్తికడుతున్నాయి. పుష్కర ఘాట్లలో అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి తీవ్ర ఆరోపణలు చేయగా, వాటిపై స్పందించిన యరపతినేని శ్రీనివాస్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కాకముందు బస్సుల్లో దోపిడీలు చేయించిన చరిత్ర పిన్నెల్లిదని ఆయన మండిపడ్డారు. అలాంటి పిన్నెల్లి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. సీబీఐ, కోర్టులు ఎక్కడుంటాయో ఆయన పార్టీ నేతకే బాగా తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. తనపై పిన్నెల్లి చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలుంటే నిరూపించాలని ఆయన సవాల్ విసరారు. వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లిపై ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.