: తెలంగాణ సర్కార్‌కు సుప్రీంలో ఊరట.. వీసీల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్


తెలంగాణ సర్కారుకి ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. నెలరోజుల క్రితం తొమ్మిది మంది వైస్ ఛాన్స‌ల‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర స‌ర్కార్ జీవో జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, వీసీల నియామ‌క ఉత్తర్వులు ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ముఖుల్‌రోహ‌త్గీ, విశ్వ‌నాథ్‌శెట్టి వాదనలు వినిపించారు. రాష్ట్రాల విశ్వ‌విద్యాల‌యాల‌కు వీసీలను నియ‌మించే అధికారం రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి ఉంద‌ని వారు వాదించారు. దీంతో కొత్త వీసీల కొనసాగింపునకు సుప్రీంకోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News