: రేవంత్‌రెడ్డి, ఎల్.రమణలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు ఇటీవల చేసుకున్న సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందానికి నిరసనగా టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్‌నుంచి జలసౌధకు చేరుకుని అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో ఎల్.రమణ, రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. టీడీపీ ఆందోళనతో లక్డీకాపూల్ నుంచి ఎర్రమంజిల్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందేనని వీరు డిమాండ్ చేశారు.