: ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరెస్టు


అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలంటూ వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్ హౌస్ వద్ద ఆయన ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి పంప్ హౌస్ వద్దకు వెళ్తుండగా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, రోడ్డుపై బైఠాయించి, ఆందోళనకు దిగిన విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.

  • Loading...

More Telugu News