: ‘గ్రాండ్ కాకతీయ’ యజమాని కుమారుడితో నిమ్మగడ్డ కూతురు వివాహం!


ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి వివాహం నిన్న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. భాగ్యనగరిలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో పేరెన్నికగన్న గ్రాండ్ కాకతీయ షెరటాన్ హోటల్ యజమాని శివకుమార్ రెడ్డి కుమారుడు ప్రణవ్ రెడ్డితో స్వాతికి జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వివాహానికే టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతతో కలిసి వెళ్లి మీడియా కెమెరాలకు చిక్కిపోయాడు. ప్రణవ్ రెడ్డి, స్వాతి పెళ్లికి కలిసే వెళ్లిన చైతూ, సమంతలు కలిసికట్టుగానే నూతన వధూవరులను ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News