: కాంగ్రెస్ కు దేవినేని నెహ్రూ ఝలక్... చంద్రబాబుతో చర్చలు!


విజయవాడ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టున్న నేత దేవినేని నెహ్రూ అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్లో చర్చించిన ఆయన, నేడు లేదా రేపు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడి టీడీపీలో చేరే విషయమై స్వయంగా ప్రకటన వెలువరించనున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తమ పార్టీలోకి దేవినేని చేరిక ఖాయమని, అందుకు అధినేత నుంచి కూడా అంగీకారం వచ్చిందని తెలిపాయి. ఆయన తన కార్యకర్తలు, అభిమానులతో పార్టీ మారే విషయమై ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. ఇక దేవినేని, తెలుగుదేశం పార్టీలో చేరితే, విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నేతను కోల్పోయినట్టే!

  • Loading...

More Telugu News