: కదలిక తెచ్చినందుకు పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు: డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో కదలిక తెచ్చినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ పోరాటం చేస్తామని, తమ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదని అన్నారు. తాము సంవత్సరానికి ఒకసారి వేదికపైకి ఎక్కి హోదా గురించి మాట్లాడి మరో ఏడాది పాటు కనిపించకుండా వెళ్లిపోయే రకం కాదని అన్నారు. హోదా కోసం కేంద్రంపై అనునిత్యం ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. పవన్ కల్యాణ్ సభ తరువాత, ప్రతి ఒక్కరూ హోదాపై మాట్లాడటం మొదలు పెట్టారని, ఈ కదలిక ఎంత వరకూ వెళుతుందో, పవన్ తన మాట మీద ఎలా నిలబడతారో వేచి చూస్తామని కేఈ తెలిపారు.

  • Loading...

More Telugu News