: ఉస్సేన్ బోల్ట్ విజయ రహస్యం గొడ్డు మాంసమే!... బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు


భువిపై అత్యంత వేగంగా పరిగెత్తే రికార్డులున్న ఉస్సేన్ బోల్ట్, చిన్నప్పటి నుంచి పేదరికం కారణంగా గొడ్డుమాంసం తినడానికి అలవాటు పడ్డాడని, ఆ అలవాటే అతను 9 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించేందుకు కారణమని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. ఈ జమైకా లెజండ్ విజయాల వెనకున్న సీక్రెట్ ఇదేనని, అతని శిక్షకుడు సైతం రెండుపూటలా బీఫ్ తినమని సలహాలు ఇచ్చేవాడని చెప్పారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో తొలి పతకం నెగ్గిన బోల్ట్, తాజా రియో ఒలింపిక్స్ లో 9వ స్వర్ణాన్ని గెలిచి, తన కెరీర్ ను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఇక గొడ్డుమాంసం తింటేనే పతకాలు వస్తాయన్న కోణంలో ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News