: చంద్రబాబు కన్నెర్ర చేస్తే మోదీ, గీడీ ఎక్కడాగుతారు?: ఉండవల్లి అరుణ్ కుమార్


ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబునాయుడు కన్నెర్ర చేస్తే మోదీ గీడీ ఎక్కడాగుతారంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నాక మోదీ వీక్ నెస్ లో ఉన్నాడు. రేపు ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు వస్తున్నాయి. 'నీ సంగతి బయటపెడతాను, మోదీ ఏదీ చెప్పినా నమ్మకండి' అని ఈ ఎన్నికలప్పుడు వీడియో షోల ద్వారా చంద్రబాబు నాయుడు చెబితే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే, చంద్రబాబు నాయుడికి ఆ గ్లామర్ ఉంది. చంద్రబాబు మేధావి, ఈయన చాలా డిఫరెంట్, గొప్పవాడు. కంప్యూటర్ కనిపెట్టాడు, సింధుకు షటిల్ ఆడటం ఇతనే నేర్పాడు.. ఇటువంటి వన్నీ వింటే మనకు నవ్వొస్తుంది కానీ, మిగతా దేశమంతా కూడా చంద్రబాబును నమ్ముతారు. ఇటువంటి హెచ్చరిక కనుక చంద్రబాబు చేస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిక్లేర్ చేసి తీరాలి. ఇదంతా నా ఊహ. కానీ, చంద్రబాబు తలచుకుంటే ఇలాంటివి వంద ట్రిక్కులు చేయగలడు. ఏపీకి ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు ఆసక్తి లేదేమో నాకు అర్థం కావట్లేదు. త్వరలోనే అమరావతి నిజ స్వరూపాన్ని నేను బయటపెడతాను’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News