: హాజీ అలీ దర్గాలో చాదర్ సమర్పించి, ప్రార్థనలు చేసిన తృప్తి దేశాయ్


భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు, ఉద్యమకర్త తృప్తి దేశాయ్ ముంబయిలోని ప్రఖ్యాత హాజీ అలీ దర్గాను సందర్శించారు. దర్గాలో చాదర్ సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలన్నారు. తమ ప్రార్థనలు ఫలించి తీర్పు అనుకూలంగా రావడంతో హాజీ అలీ బాబాకు చాదర్ సమర్పించానని, ఆశీర్వాదాలు తీసుకున్నానని అన్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లవద్దని హాజీ అలీ దర్గా ట్రస్ట్ ను కోరానని తృప్తి దేశాయ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News