: రాయలసీమలో 24 గంటల ఉచిత విద్యుత్తు
రాయలసీమలో పంటల సాగుకు ఉచిత విద్యుత్తు ను అందజేయనున్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తామని ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండిపోతున్న పంటలకు ఒక్క తడి వరకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు. కాగా, అనంతపురం జిల్లా పర్యటన ముగించుకున్న చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. వి.కోటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.