: కశ్మీర్ గవర్నర్ కు పదవీ గండం!... రేసులో ఐదుగురు!


హిజ్బుల్ ముజాహిదీన్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తో జమ్ము కశ్మీర్ లో గడచిన 50 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోడ్లపైకి వచ్చేస్తున్న యువత పోలీసులపైకి రాళ్లు రువ్వుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. వెరసి ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా పదవికి ముప్పు ఏర్పడింది. వోహ్రాను తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుందని అత్యున్నత స్థాయి అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో వోహ్రా ఎలాంటి చొరవ చూపడం లేదన్న కారణంగా ఆయనను కశ్మీర్ గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే... వోహ్రా ప్లేస్ లో కశ్మీర్ గవర్నర్ పదవి చేపట్టేందుకు ఐదుగురితో కూడిన ఓ జాబితా కూడా సిద్ధమైపోయిందని తెలుస్తోంది. ఈ జాబితాలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బీసీ ఖండూరీ, జనరల్ సయ్యద్ అతా హుస్సేన్, జనరల్ వీపీ మాలిక్, ఢిల్లీ మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ విజయ్ కపూర్, మిజోరాం మాజీ గర్నవర్ ఏఆర్ కోహ్లీ ఉన్నారట. త్వరలోనే వోహ్రాను సాగనంపి, ఆయన స్థానంలో ఈ ఐదుగురిలోని ఎవరికో ఒకరికి మోదీ పదవీ బాధ్యతలు అప్పగించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి.

  • Loading...

More Telugu News