: ఒలింపిక్ స్టార్లకు బీఎండబ్ల్యూ కార్లిచ్చి ఢిల్లీ ఫ్లైటెక్కించిన సచిన్!... మధ్యాహ్నం ప్రధానితో భేటీ!
రియో ఒలింపిక్స్ లో సత్తా చాటిన క్రీడాకారులు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు బీఎండబ్ల్యూ కార్లు బహూకరించేందుకు నేటి ఉదయం హైదరాబాదు వచ్చిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కాసేపటి క్రితం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. తనతో పాటు సింధు, సాక్షి, దీపా, గోపీచంద్ లను కూడా ఆయన ఢిల్లీ తీసుకువెళ్లారు. మరికాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ కానున్న సచిన్... ఈ నలుగురిని వెంటబెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సింధు, సాక్షి, దీపా, గోపీచంద్ లను మోదీ ఘనంగా సన్మానించనున్నట్లు సమాచారం.