: ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన మరో దారుణ వీడియో.. బందీలను కాల్చి చంపిన ఉగ్ర బాలురు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దురాగతాలకు అంతుపొంతు లేకుండా పోతోంది. ఐసిస్ విడుదల చేసిన తాజా వీడియో ఈ విషయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. తమ వద్ద ఉన్న బందీలను ఐదుగురు చిన్నారులతో కాల్చి చంపించింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఈ వీడియోలో సైనిక దుస్తులు ధరించిన ఐదుగురు చిన్నారులు చేతుల్లో తుపాకులతో బందీల వెనక నిల్చున్నారు. వీరి వయసు 10-13 ఏళ్ల లోపే ఉండడం గమనార్హం. వీరిలో ఒక బాలుడు బ్రిటన్‌కు చెందిన వాడు. అతడి పేరు అబు అబ్దుల్లా అల్ బ్రిటాని కాగా మిగతావారు అబు అల్ బరా అల్ టునిషి(ట్యునీషియా), అబు ఇషాఖ్ అల్ మాస్రి(ఈజిప్ట్),అబు ఫువద్ అల్ కుర్ది(కుర్దు), యూసుఫ్ అల్ ఉజ్‌బకి(ఉజ్బెకిస్థాన్)కు చెందిన వారుగా భావిస్తున్నారు. వీరు కాల్చిచంపిన బందీలు అందరూ కుర్దులు. అయితే ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారనే విషయం తెలియరాలేదు. బందీలను కాల్చడానికి ముందు ఉగ్రబాలలు తక్బీర్(అల్లాహు అక్బర్) అని నినాదాలు చేశారు.