: గోపీచంద్ అకాడెమీలో సచిన్ సెల్ఫీ సందడి!
ఒలింపిక్ స్టార్లకు బీఎండబ్ల్యూ కార్లను బహూకరించేందుకు హైదరాబాదు వచ్చిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్... పుల్లెల గోపీచంద్ అకాడెమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనదైన శైలిలో సందడి చేశారు. శంషాబాదు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అకాడెమీకి చేరుకున్న సచిన్... అక్కడికి అప్పటికే చేరుకున్న ఒలింపిక్ స్టార్లు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లను ప్రత్యేకంగా పలుకరించారు. వారితో కరచాలనం చేసిన సచిన్... వారితో వేర్వేరుగా ముచ్చటించారు. అనంతరం వేదిక ఎక్కిన సచిన్ గోపీచంద్, సింధు, సాక్షి, దీపాలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన బీఎండబ్ల్యూ కార్లను ఆయన వారికి అందజేశారు.