: అభిమానుల అత్యుత్సాహం... పడిపోబోయిన పవన్ కల్యాణ్


ప్రముఖ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో కిందపడిపోబోయారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో బహిరంగ సభను నిర్వహించనున్న పవన్ కల్యాణ్ ను చూసేందుకు బయల్దేరారు. ఈ సమయంలో గెస్ట్ హౌస్ నుంచి బయటకు రాగానే అభిమానుల కోలాహలం ప్రారభమైంది. పవన్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. పవన్ కల్యాణ్ కారు వద్దకు చేరుకోబోతుండగా ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆయనను ముట్టుకునేందుకు తోసుకువచ్చారు. భారీ సంఖ్యలో అభిమానులు పోటీ పడడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అభిమానుల అత్యుత్సాహంతో ప‌వ‌న్ కల్యాణ్ కిందపడిపోబోయాడు. ఇంతలో అభిమానులు ఆయనను కింద పడకుండా పట్టుకోవడంతో నిలదొక్కుకున్న పవన్ కల్యాణ్ సభాప్రాంగణానికి బయల్దేరారు. అయితే దారి పొడుగునా అభిమానుల కోలాహలం నేపథ్యంలో ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కాగా, ఈ సమావేశంలో ఆయన ఏ అంశంపై మాట్లాడ‌నున్నారన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఆస‌క్తినెల‌కొంది.

  • Loading...

More Telugu News