: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 'బ్రూస్ లీ' విలన్
ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ కుమారుడు, తమిళ నటుడు అరుణ్ విజయ్ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. 'ప్రియం' సినిమాతో అరంగేట్రం చేసిన అరుణ్ విజయ్ పలు సినిమాల్లో నటించినా స్టార్ గా మారలేకపోయాడు. ఈ నేపధ్యంలో తెలుగులో 'బ్రూస్ లీ' సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రాత్రి ఓ ఫంక్షన్ కు భార్యతో కలిసి హాజరయ్యాడు. తిరిగి వస్తుండగా చెన్నైలో నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొరికాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.