: అధిక ఫీజులపై మరోసారి రోడ్డెక్కిన పేరెంట్స్.. పిల్లలకు టీసీలు ఇస్తున్నార‌ని ఆందోళ‌న‌


పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయని త‌ల్లిదండ్రులు మ‌రోసారి రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట స్కూల్ పేరెంట్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు మౌన ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. నోటికి న‌ల్ల‌గుడ్డ‌లు క‌ట్టుకొని ఆందోళ‌న‌ తెలిపారు. త‌మ ప‌ట్ల స్కూల్ యాజ‌మాన్యాలు ద‌యచూప‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని వాపోయారు. అధిక ఫీజులు చెల్లించాల్సిందేనంటూ త‌మ‌ను వేధిస్తున్నార‌ని, క‌ట్ట‌క‌పోతే టీసీలు ఇస్తామ‌ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొంద‌రు విద్యార్థుల‌కు టీసీలిచ్చి పంపించేశార‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం దీనిపై వెంట‌నే స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News