: ఎయిర్ టెల్ సంచలనాత్మక ఆఫర్... శాంసంగ్ జే సిరీస్ ఫోన్ కొనేవాళ్లకు రూ. 250కే 10 జీబీ డేటా
అత్యాధునిక 4జీ తరంగాలు అందుబాటులోకి వచ్చిన వేళ, తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు రిలయన్స్ ఉచిత ఆఫర్ తో వచ్చి మిగతా టెలికం కంపెనీలకు సవాల్ ను విసురుతున్న ప్రస్తుత సమయంలో, ఇప్పటికే పలు కంపెనీలు ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, తాను వినియోగదారులను కోల్పోరాదన్న ఉద్దేశంతో ఎయిర్ టెల్ సంచలనాత్మక ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ జే సిరీస్ ఫోన్ కొనేవాళ్లకు 1 జీబీ డేటా ధర రూ. 250లోనే 10 జీబీ 4జీ డేటాను ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుత ఎయిర్ టెల్ యూజర్లు కూడా దీన్ని వినియోగించుకోవచ్చని, 4జీ తరంగాలు లభ్యం కాని ప్రాంతంలో 3జీ డేటా అందుతుందని సంస్థ పేర్కొంది.