: షారూక్ ఖాన్ కు దుప్పి చర్మంతో చెప్పులు తయారు చేసేందుకు పాక్ లో ఆర్డరిచ్చిన కజిన్!
భారత సినీ నటుడు షారూక్ ఖాన్ కు దుప్పి చర్మంతో తయారు చేసిన చెప్పులను పంపుతున్నానని చెప్పిన పాక్ పాదరక్షల వ్యాపారి జహంగీర్ ఖాన్ జైలుకెళ్లాడు. పెషావర్ లో ఉండే షారూక్ కజిన్, షారూక్ కోసం రెండు జతలు కావాలని ఆర్డర్ ఇచ్చారని, తాను వాటిని తయారు చేశానని మీడియా సమావేశం పెట్టి ప్రకటించడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను షారూక్ కు వీరాభిమానినని కూడా జహంగీర్ చెప్పుకున్నాడు. ఈ వార్త ప్రసారం కావడంతో వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు చెప్పులు తయారు చేయించేందుకు దుప్పి చర్మాన్ని వాడారా? అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. దుప్పి చర్మాన్ని వాడినట్లయితే, చట్ట ప్రకారం అతనికి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.