: రేపు హైదరాబాద్‌కు రానున్న సచిన్.. రియో ఒలింపిక్స్ స్టార్స్‌కు బీఎండబ్యూ కార్ల బహూకరణ
భారత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. భారత రియో ఒలింపిక్స్ స్టార్లు పి.వి. సింధు, దీపా కర్మాకర్, సాక్షిమాలిక్, కోచ్ గోపిచంద్‌లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్యూ కార్లు అందనున్నాయి. వీరికి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్, పలువురు వ్యాపారవేత్తలు ఈ కార్లను స్పాన్సర్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం. రేపు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో ఈ కార్యక్రమం జరగనుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది.